క్రైమ్/లీగల్

ఆజంఖాన్‌పై మరో కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో/ బడౌన్, అక్టోబర్ 24: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్‌కు వ్యతిరేకంగా పోలీసులు వారం రోజులలోపే రెండో కేసు నమోదు చేశారు. ఆజంఖాన్ రెండేళ్ల క్రితం దళిత నేత, రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఈ రెండో కేసులో అభియోగం మోపారు. అంబేద్కర్ మహాసభ ప్రధాన కార్యదర్శి అమర్‌నాథ్ ప్రజాపతి మంగళవారం లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ రెండో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, అధికార బీజేపీ ఎన్నికల్లో పోరాడటానికి తన పేరును వినియోగించుకుంటోందని ఆజంఖాన్ పేర్కొన్నారు. ‘నేను బీజేపీ ఐటెం గర్ల్‌ను’ అని ఆయన అన్నారు. ఆజంఖాన్ రెండేళ్ల క్రితం అంబేద్కర్‌ను ‘్భఆక్రమణదారు’గా అభివర్ణించారని ప్రజాపతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆజంఖాన్ 2016లో ఘజియాబాద్‌లో హజ్ హౌజ్‌ను ప్రారంభిస్తూ చేసిన ప్రసంగంలో అంబేద్కర్‌ను అవమానించారని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ అంతకు ముందు అక్టోబర్ 17న ఆజంఖాన్‌పై గోమ్‌తినగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమార్తెలపై యాసిడ్ దాడి చేస్తానని ఆజంఖాన్ బెదిరింపులకు దిగినట్టు అమర్ సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆజంఖాన్ ఒక టెలివిజన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను, కవలలు అయిన తన 17 ఏళ్ల కుమార్తెలను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారని అమర్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజా కేసు నేపథ్యంలో ఆజంఖాన్ స్పందిస్తూ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ అన్ని ఎన్నికల్లోనూ తన పేరును ఉపయోగించుకుంటోందని ఆయన పేర్కొన్నారు.