క్రైమ్/లీగల్

సీబీఐ అవినీతిపై దర్యాప్తునకు సిట్ వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: సీబీఐ డైరెక్టర్లపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినందున సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో గురువారం పిల్ దాఖలైంది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ, ప్రస్తుతం సెలవుపై వెళ్లిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ ఆస్థానాలపై విచారణ జరిపించేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆ పిటిషన్‌లో ప్రశాంత్ భూషణ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలో అవినీతికి సంబంధించి ఇంతకుముందే ప్రత్యేక డైరెక్టర్ ఆస్థానా, డీఎస్పీ దేవేందర్ కుమార్ తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే.