క్రైమ్/లీగల్

టాస్క్ఫోర్స్ తనిఖీల్లో లక్షల్లో నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. రాష్టవ్య్రాప్తంగా గురువారం వేర్వేరు జిల్లాల్లో లక్షలాది రూపాయల నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తుండడంతో పెద్దమొత్తంలో నగదు లభ్యవౌతోంది. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో దాదాపు 21.50 లక్షల రూపాయల నగదు పట్టుకొన్నారు. అలాగే, కామారెడ్డి జిల్లా కుకునూర్ ఎక్స్‌రోడ్డు వద్ద జరిపిన తనిఖీల్లో 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో లక్షా 90వేలు లభ్యం కాగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుంటపల్లి గ్రామం వద్ద కారులో తరలిస్తున్న 9లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా, కరీంనగర్‌లో టాస్క్ ఫోర్స్ దాడుల్లో 31వేల 440 రూపాయల నగదుతో పాటు ఐదు లక్షల 65వేల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు.

చిత్రాలు.. ..సిద్దిపేట జిల్లాలో పట్టుబడిన నగదు
* సూర్యాపేటలో కారులో పట్టుబడిన రూ. 9లక్షలు