క్రైమ్/లీగల్

ఇద్దరు గొలుసు దొంగలు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట), అక్టోబర్ 26: నగరంలో గతకొంత కాలంగా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఇరువురు వ్యక్తులను అర్బన్ సీసీయస్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ 3లక్షల 50వేల నగదు, 6 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సీసీయస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సిసియస్ అడిషనల్ ఎస్పీ శ్రీరాఘవ నిందితుల వివరాలను వెల్లడించారు. తెనాలికి చెందిన చుక్కా గోపీచంద్ క్యాటరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తు ఉద్యోగంలో వచ్చే డబ్బులు సరిపడక అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంలో నగరంలో ఒంటిరిగా వెళుతున్న మహిళలే లక్ష్యంగా వారి వద్ద నుంచి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. ఇతనిపై నగరంపాలెం, పాతగుంటూరు, కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలో కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఈ క్రమంలో అతనికి కొండపాటూరు గ్రామానికి చెందిన ఎం రవి ఇంట్లో నుంచి అలిగి రావడంతో ఇద్దరు కలసి నగరంలోని లాడ్జిలో అద్దెకు ఉంటూ చోరీలకు పాల్పడుతున్నారన్నారు. శుక్రవారం ఇరువురు బ్రహ్మనందరెడ్డి స్టేడియం వద్ద నాలుగు సెల్‌పోన్లు అపహరిస్తుండగా వారిని పట్టుకున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సీసీఎస్ సిఐలు సుబ్రహ్మణ్యం, సురేష్‌బాబు, పాత గుంటూరు సిఐ శ్రీనివాసరావు, ఐటి కోర్‌టీం బాలాజీ తదితరులు పాల్గొన్నారు.