క్రైమ్/లీగల్

ఇద్దరు మిలీషియా సభ్యులు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంచంగిపుట్టు, అక్టోబర్ 26: మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్న ఇద్దరు గిరిజన యువకులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసారు. ముంచంగిపుట్టులో వాహనాలు తనిఖీ చేస్తుండగా బూసుపుట్టు పంచాయతీ సంతవీధి గ్రామానికి చెందిన పాంగి నాగేష్, తుడుంరాయి గ్రామానికి చెందిన కిల్లు లచ్చన్నలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము అదుపులోకి తీసుకున్న వారిని విచారించగా మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులుగా నిర్థారణ కావడంతో వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు స్థానిక ఎస్.ఐ. అరుణ్‌కిరణ్ విలేఖరులకు తెలిపారు.