క్రైమ్/లీగల్

లింగంపేటలో వివాహిత ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణాదేవిపేట, అక్టోబర్ 26: కుటుంబ సభ్యులతో ఘర్షణపడిన లింగంపేట గ్రామానికి చెందిన వివాహిత అంబటి పంతులమ్మ అలియాస్ చిన్నబుచ్చి(24)) శుక్రవారం మధ్యాహ్నాం పురుగుల మందు తాగి ఆత్మకు పాల్పడింది. ఈసంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. లింగంపేట గ్రామానికి చెందిన అంబటి చిన్నతల్లి గత కొన్నాళ్ళుగా తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈమె నర్సీపట్నంలో తన అన్నయ్య వర ప్రసాద్ ఫండ్లు దుకాణంలో పని చేస్తుంది. ఎప్పటిలాగానే శుక్రవారం ఉదయం దుకాణం తెరిచి అన్నా చెళ్ళుల్లు పని చేసుకుంటుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు అక్కడికు రావడంతో స్వల్ప వివాదం జరిగింది. ఈవివాదంపై మనస్థాపం చెందిన చిన్నతల్లి మధ్యాహ్నాం భోజనానికి చెప్పి వెళ్ళి బయట మార్కెట్‌లో పురుగుల మందు కొనుగోలు చేసింది. దానిని ఇంటి వద్ద తాగింది. తాను చనిపోతున్నట్లు అన్నయ్యకు సమాచారం తెలియజేసింది.దీంతో వారు గ్రామస్తుల సహకారంతో ద్విచక్ర వాహనంపై స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ విషమించడంతో చిన్నబుజ్జిని మెరుగైన వైద్య సేవలకై నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. చినబుజ్జి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.