క్రైమ్/లీగల్

బ్లూకోట్స్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని టౌన్, అక్టోబర్ 29: ప్రజల రక్షణ కోసం ఎప్పటికప్పుడు గస్తీ తిరిగే బ్లూకోట్స్, పెట్రోలింగ్ బృందాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఎన్టీపీసీ ఇడిసి సెంటర్‌లో బ్లూకోట్స్, వాహనాల తనిఖీ బృందాలకు ఒక్క రోజు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిపి సత్యనారాయణ వాహనాల తనిఖీ బృందాలకు ప్రత్యేక సూచనలు చేశారు. శాంతి భద్రతల విషయంలో పోలీస్ సిబ్బంది రాజీ పడకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించడకుండా నిబద్ధతతో పని చేయాలని సూచించారు. ప్రజల భద్రతకు పూర్తిగా కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. తనిఖీల సందర్భంగా ఏ ఒక్కరూ అనుమానితంగా కనిపించిన వెంటనే ప్రశ్నించి పూర్తి వివరాలను ఆరా తీయాలని స్పష్టం చేశారు. నేరాలు జరిగాక చూద్దాంలే అన్న వ్యవహారాన్ని పక్కన పెట్టి అసలు నేరాలు జరగకుండా సదరు భద్రతా సిబ్బంది మందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. నేరాలు, ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ఎక్కువ గస్తీ నిర్వహించాలని, పాత నేరస్థులు, అనుమానితులపై ఒక కన్ను వేసి ఉంచాలని అన్నారు.

అక్రమ అరెస్టులపై బీజేపీ ధర్నా

పోలీస్ స్టేషన్ ఎదుట భైఠాయింపు
రెండు గంటల పాటు ఉద్రిక్తత
కరీంనగర్ టౌన్, అక్టోబర్ 29: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ కార్యకర్తలను బైండోవర్ చేస్తూ, అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ సోమవారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ పిఎస్ ఎదుట రెండు గంటలకు పైగా బైఠాయించటంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయి, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెల్సుకున్న నగర ఏసిపితో పాటు పలువురు పోలీసు పోలీసు అధికారులు ఆందోళన స్థలికి చేరుకుని సముదాయించి, ఆందోళన విరమింపజేసేందుకు యత్నించినా ససేమిరా అంటూ, సీపీ రావాల్సిందేనని పట్టుబట్టడంతో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు టూ టౌన్ ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న నాయకులను బలవంతంగా అరెస్టు చేసి, శివారులోని పోలీస్ శిక్షణ కళాశాలకు తరలించారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, నగరంలో అధికార నేతల అరాచకాలకు అంతే లేకుండా పోయిందని, పోలీసులను తమకు అనుకూలంగా మార్చుకుని, ఎదుటి పార్టీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తుండటం శోచనీయమన్నారు. ఎలాంటి చిన్న కేసులు కూడా లేకున్నా తమ కార్యకర్తలను బైండోవర్ చేస్తూ, అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మల్లా మారటం పోలీసు వ్యవస్థకే మాయని మచ్చగా మారిందన్నారు. నగరంలో అధికార నేతల ఆగడాలకు చెక్ పెట్టేందుకు నిర్ణయించుకున్న నగరవాసుల తీరుతో భయబ్రాంతులకు గురై, బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు ఏకపక్ష ధోరణి విడనాడి, అక్రమ కేసులు ఎత్తివేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.