క్రైమ్/లీగల్

పాత వాహనాలు సీజ్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో 15 ఏళ్లు నిండిన పెట్రోలు వాహనాలను, పదేళ్లు నిండిన డీజిల్ వాహనాలను సీజ్ చేయాలని రవాణా శాఖను సోమవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాంటి వాహనాల వివరాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ), రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్లలో పొందుపరచాలని సూచించింది. ఢిల్లీ పరిసరాల్లో
వాతావరణ కాలుష్యాన్ని అదుపు చేయాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని హెచ్చరించింది. అలాగే ఈ విషయం ప్రజలందరికీ తెలిసేలా వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచ్ ఆదేశాలు జారీచేసింది. అలాగే పర్యావరణానికి సంబంధించి ప్రజలు ఎలాంటి ఫిర్యాదులు చేసినా వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని, అందుకోసం ఒక సోషల్ మీడియా అకౌంట్‌ను కూడా ప్రారంభించాలని సీపీసీబీకి సూచించింది. 15ఏళ్లకు మించిన పెట్రోలు వాహనాలు, పదేళ్లకు మించిన డీజిల్ వాహనాలను నిషేధించే అధికారం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) కు కూడా ఉంటుందని పేర్కొంటూ, గతంలో ఎన్‌జీటీ జారీచేసిన ఆదేశాలను పాటించాల్సిందేనని వెల్లడించింది.
చిత్రం..కాలుష్యంతో మసకబారిన ఢిల్లీ నగరం