క్రైమ్/లీగల్

రేవంత్‌రెడ్డికి భద్రత పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరిన విధంగా భద్రత కల్పించాలని కేంద్రప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అయితే భద్రతకు అయ్యే ఖర్చును రేవంత్‌రెడ్డి భరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తనకు కేంద్ర సిబ్బందితో నిరంతరం నలుగురు ఉండేలా భద్రత కల్పించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్‌పై పోరాడుతున్నందున తనకు ప్రాణ హాని ఉందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయం కనుక తనకు నాలుగు ప్లస్ నాలుగు సెక్యూరిటీ కల్పించాలని అన్నారు. తనకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేనందునే కేంద్ర భద్రత కావాలని ఈసీనీ, కేంద్రాన్ని కోరినా స్పందన లేదని ఆయన తరఫున న్యాయవాది పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు, రేవంత్‌రెడ్డి కోరిన విధంగా భద్రత కల్పించాలని ఖర్చును మాత్రం ఆయనే భరించాలని పేర్కొంది.