ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 6: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును టీడీపీ సభ్యుడిగా పేర్కొంటూ మార్ఫింగ్ చేసిన సభ్యత్వ కార్డును ప్రచారం చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జోగి రమేషన్‌ను గుంటూరు అరండల్‌పేట పోలీసులు మంగళవారం విచారించారు. శ్రీనివాసరావు టీడీపీ సభ్యుడేనంటూ సభ్యత్వ కార్డు చూపిస్తూ జోగి రమేష్ విలేఖరుల సమావేశంలో ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరిపారు. సుమారు 5 గంటల పాటు జోగి రమేష్‌ను వెస్ట్ డీఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో అరండల్‌పేట పోలీసులు విచారించారు. మరలా ఈనెల 15వ తేదీన తనను విచారణకు రమ్మని పోలీసు అధికారులు తెలిపారని, తానూ ఏ తప్పు చేయనందున విచారణకు పూర్తిగా సహకరిస్తానని రమేష్ తెలిపారు.
నీరుగార్చేందుకు ప్రభుత్వం యత్నాలు
జగన్‌పై దాడి కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని జోగి రమేష్ ధ్వజమెత్తారు. మంగళవారం గుంటూరు అరండల్‌పేట పోలీసుస్టేషన్‌లో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సభ్యుడని చూపించే గుర్తింపుకార్డు ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాన్ని తాను విలేఖరుల సమావేశంలో చూపించానని, తాను ఏ తప్పూ చేయకపోయినా పోలీసులు విచారణకు పిలవడం సరికాదన్నారు. వైసీపీ నేతలపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా టీడీపీ పెద్దలు వ్యవహరిస్తుంటే వారికి పోలీసులు వత్తాసు పలకడం సరికాదన్నారు. ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఒక నటుడు ఏపీలో అరాచకం జరుగుతుందని ముందే హెచ్చరించినా ఇంటలిజెన్స్ వర్గాలు ఎందుకు వౌనంగా ఉన్నాయని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉందని జోగి రమేష్ స్పష్టంచేశారు. ఆయన వెంట వైసీపీ అధికార ప్రతినిధులు కె పార్థసారథి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మహ్మద్ ముస్త్ఫా, తదితరులున్నారు.