ఆంధ్రప్రదేశ్‌

తవ్వుతున్నకొద్దీ తరగని ఆస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 6: విశాఖ ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ (ఏఎంవీఐ) శరగడం వెంకటరావు ఆస్తులపై సోదాలు నాలుగవ రోజు కొనసాగాయి. వెంకటరావుకు చెందిన బ్యాంకు లాకర్లను సోమవారం తెరచిన అధికారులు కిలోల కొద్దీ బంగాలు, వెండి ఆభరణాలు స్వాదీనం చేసుకున్నారు. తాజాగా మంగళవారం వెంకటరావు డ్రైవర్‌ను విచారించిన ఏసీబీ అతని బందువు ఇంట్లో రెండు సూట్‌కేసుల్లో దాచిన డాక్యుమెంట్లు, డిపాజిట్ పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడులు జరిగేందుకు ఒక రోజు ముందు వెంకటరావు వ్యక్తిగత డ్రైవర్ పీ మోహనరావు ద్వారా మూడు అట్టపెట్టెలు, రెండు సూట్‌కేసులతో ఫిక్స్‌డ్ డిపాజిట్ సర్ట్ఫికెట్లు, స్థిరాస్తులకు సంబంధించిన దస్తావేజులు, ప్రామిసరీ నోట్లు, కోర్టు స్టాంపులు, రబ్బర్ స్టాంపులను ఇంట్లోంచి తరలించారు. డ్రైవర్ మోహనరావును ఏసీబీ అధికారులు గుచ్చిగుచ్చి ప్రశ్నించగా పెట్టెల తరలింపు విషయం వెలుగుచూసింది. వీటిని తన తోడల్లుడు కిరణ్‌కుమార్ ఇంట్లో దాచినట్టు మోహనరావు వెల్లడించాడు. దీంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ కిరణ్‌కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. అట్టపెట్టెలు, సూట్‌కేసులు తెరచి చూసిన ఏసీబీ అధికారులు నివ్వెర పోయిన పరిస్థితి. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో సుమారు రూ.కోటికి పైగా నగదు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్టు పత్రాలు లభ్యమయ్యాయి. అక్కయ్యపాలెం ఆంధ్రాబ్యాంకులో 8 డిపాజిట్‌ల రూపంలో రూ.6.2 లక్షలు, చోడవరం ఆంధ్రాబ్యాంకులో రెండు డిపాజిట్ల రూపంలో రూ.4.2 లక్షలు, గౌరీ కోఆపరేటివ్ బ్యాంకులో 4 డిపిజిట్ల రూపంలో రూ.4 లక్షలు, కోటక్ మహీంద్ర బ్యాంకులో 14 డిపాజిట్ల రూపంలో రూ.7 లక్షలు, విశాఖ శ్రీగౌరి మూచ్యువల్ ఎయిడెడ్ బ్యాంకులో 17 డిపాజిట్‌ల రూపంలో రూ.85 లక్షలమేర నగదు డిపాజిట్ చేశారు. వీటితో పాటు రూ.4.5 లక్షల నగదు బయటపడింది.
ఇక వెంకటరావు సొంతూరు ఆరిపాకలో తల్లి వెంకాయమ్మ పేరిట 23 శెంట్ల భూమి, బంగార్రాజుపాలెం గ్రామంలో కాళ్ల రమణ పేరిట 45 శెంట్ల భూమి, ఆరిపాకలో శరగడం సిమ్మినాయుడు, శరగడం సత్యనారాయణ పేరిట 2.4 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్ జెరాక్స్ ప్రతులు లభ్యమయ్యాయి. వీటితో పాటు సంతకాలు చేసిన ఖాళీ ప్రామిసరీ నోట్లు ఐదింటిని ఏసీబీ అధికారులు గుర్తించారు.
నాన్ జ్యుడీషియల్ స్టాంప్స్ 32, రబ్బరు స్టాంపులు 4 అధికారుల సోదాల్లో బయటపడ్డాయి. అంతకు ముందు బ్యాంకు లాకర్లను తెరచిన ఏసీబీ అధికారులు 3 కిలోల బంగారు, 10 కిలోల వెండి ఆభరణాలను కనుగొన్నారు. సోదాల్లో ఏసీబీ డీఎస్పీ రమాదేవి సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రం..ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలు, స్థిరాస్తి దస్తావేజులు, నగదు