క్రైమ్/లీగల్

అంతర్ జిల్లా దోపిడీ దొంగపై పీడి యాక్టు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, నవంబర్ 14: చట్ట వ్యతిరేక కార్యకలపాలతో ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కోట్యానాయక్‌తండాకు చెందిన తేజావత్ చందుపై పీడీ యాక్టు నమోదు చేసి వరంగల్ జైలుకు తరలించినట్లు గార్ల, బయ్యారం సీఐ వై రమేష్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం మాట్లాడుతూ గత కొంతకాలంగా చందు మహబూబాబాద్, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లోని దేవాలయాలు, తాళాలు వేసిన ఇళ్ళు, పలు దుకాణాల్లో చొరబడి చోరీలకు పాల్పడి పోలీసులకు సవాల్‌గా మారాడు. గత జూలైలో చందును అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించగా ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడని, ఈ మూడు జిల్లాల్లో 26 కేసును నమోదై ఉన్నాయన్నారు. గతంలో చందు నుంచి 76 గ్రాముల బంగారం, ఏడు కేజీల వెండి, ఐదు పంచలోహ విగ్రహాలు, 18 కేజీల కంచు, ఐదు లక్షల రూపాయాల నగదును స్వాధీన పర్చుకున్నామని రమేష్ వివరించారు. చందు నేర చరిత్రపై పోలీస్ శాఖ నివేదిక సమర్పించగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య పూర్తి స్థాయి పరిశీలన జరిపి తేజావత్ చందుపై పీడి యాక్టు నమోదుకు ఆదేశాలు జారీ చేశారని, ఈ మేరకు నిందితుడు చందుకు ముందస్తుగా నోటీసు అందించి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైన పాల్పడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో గార్ల ఎస్‌ఐ పి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.