క్రైమ్/లీగల్

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంసూరు, నవంబర్ 14: జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందిన సంఘటనలు బుధవారం జరిగాయ. ఓ ప్రమాదంలో అక్క తమ్ముడు మృతి చెందగా మరో ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సత్తుపల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా జరిగిన మోటారు సైకిళ్ళ ర్యాలీలో పాల్గొని వస్తూ మండల పరిధిలోని మర్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించిన సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది. పిడమర్తి రవి ఎన్నికల నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రి కెటిఆర్, తుమ్మల, జలగం, ఎంపి పొంగులేటి వస్తున్న సందర్భంగా పెద్దఎత్తున మోటారు సైకిళ్ళ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఆ ర్యాలీలో పాల్గొని ద్విచక్ర వాహనంపై వస్తున్న కంచర్ల శివ (25), ఆరెంపుల రవిచంద్ర (28)లు విద్యుత్ స్తంభానికి బైక్ ఢీకొని మరణించారు. మృతుడు రవిచంద్రకు (28) ఇద్దరు ఆడపిల్లలు కాగా మరో మృతుడు శివ(25)కు వివాహం కాలేదు. ఈ ఇద్దరూ వ్యవసాయ కూలీపనులు నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి మృతితో ఆయా కుటుంబాలకు తీరని లోటును మిగిల్చింది. ఈ వార్త మండల వ్యాప్తంగా దావనంలా వ్యపించటంతో పెద్దఎత్తున తరలివచ్చారు. మృతుల మరణం పట్ల పలు పార్టీల నాయకులు వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
టిప్పర్ ఢీకొని అక్కాతమ్ముడి మృతి
ఖమ్మం రూరల్: టిప్పర్ ఢీకొని అక్కా తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలోని వాల్యాతండా వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని ఆరెకోడు గ్రామానికి చెందిన ఆరెంపుల రవి (28), అతని దగ్గరి బంధువు(వరుసకు అక్క) ఆరెంపుల ధనమ్మ(50)లు ద్విచక్రవాహనంపై మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కనె్నగుండ్ల గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. మండలంలోని కాచిరాజుగూడెం గ్రామపంచాయతీ శివారు వాల్యాతండా వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొనడంతో తలకు బలమైన దెబ్బలు తగిలి మెదడు చింది అక్కడికక్కడే మృతి చెందగా, వాహనం రోడ్డు పక్కన పడిపోయింది. మృతుడు రవికి భార్య సులోచన, కుమారుడు, కుమార్తె, మృతురాలు ధనమ్మకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ వెంకట్రావు సంఘటనా ప్రదేశానికి చేరుకొని మృతదేహాలకు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు తెలిపారు.