క్రైమ్/లీగల్

టాస్క్ఫోర్స్ అదుపులో నకిలీ ఇన్సూరెన్స్ సర్ట్ఫికెట్ల తయారీ ముఠా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 15: నకిలీ ఇన్సూరెన్స్ సర్ట్ఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టయింది. మోటారు వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్ట్ఫికెట్లు తయారు చేసి మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఎనిమిది నకిలీ సర్ట్ఫికెట్లు, ఒక ల్యాప్‌ట్యాప్, ప్రింటర్, స్కానర్, ఏడు సెల్‌ఫోన్లు, రెండు ఆటోలు, ఆరు కార్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ కాలనీకి చెందిన సరపల్లి విజయ్‌కుమార్ (43) గతంలో ఆటో కన్సల్టెంట్‌గా పని చేసేవారు. ఈ అనుభవంతో మోటారు వాహనాలకు తక్కువ ధరకు ఇన్సూరెన్స్ చేయిస్తానని వాహనదారులను నమ్మించి సుమారు పదివేల నుంచి 20వేల వరకు ఖర్చయ్యే అసలు ఇన్సూరెన్స్ సర్ట్ఫికెట్లకు బదులు ఒక్కొక్కరి నుంచి వెయ్యి నుంచి మూడు వేల వరకు వసూలు చేస్తూ నకిలీ సర్ట్ఫికెట్లు విక్రయిస్తున్నారు. తన ఇంటి వద్దే ల్యాప్‌ట్యాప్, ప్రింటర్, స్కానర్ సాయంతో గత ఏడాదిగా వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల పేర్లతో 150 పైగా నకిలీ పత్రాలు తయారు చేశారు. ముందుగా అసలు వాటిని స్కానింగ్ చేసి అందులోని పేర్లు, తేదీలు చిరునామా, వాహనాల నెంబర్లు, రుసుము వంటి వివరాలు మార్చేసి ఈ నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో అందిన సమాచారం మేరకు సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ ఏసీపీ రాజీవ్‌కుమార్, సీఐ సురేష్‌రెడ్డి బృందం నిందితులను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు.