క్రైమ్/లీగల్

శవాలుగా తేలిన చిన్నారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిబండ, నవంబర్ 16 : మండలంలోని హిరేతుర్పి గ్రామంలో గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి తన కుమారులను కూడా బావిలోకి తోసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కర్నాటక పావగడ తాలూకా కోటకు చెందిన లక్ష్మిని పదేళ్ల క్రితం మధుగిరి తాలూకా నిడదరగల్లుకు చెందిన యతీష్‌తో వివాహమయింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తల నడుమ జరిగిన చిన్నపాటితో గొడవతో మనస్తాపానికి గురైన లక్ష్మి హిరేతుర్పి సమీపంలో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. ఆ సమీపంలో ఉన్న బావి గట్టుపై చిన్నారుల పాదరక్షలు గమనించిన పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బావిలో నీటిని తోడివేయగా వంశీ, చందులు శవాలుగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నపాటి గొడవతో జీవితంపై విరక్తి చెంది తన పిల్లలను బావిలోకి తోసి తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాఛాచాయలు అలుముకున్నాయి. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కుటుంబం ఆత్మహత్యాయత్నం

బత్తలపల్లి, నవంబర్ 16 : కుటుంబ కలహాలతోపాటు 11 సంవత్సరాల కుమారుడు రెండురోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులందరూ మూకుమ్మడిగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని జలాలపురంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని జలాలపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, శిరీష కుమారుడు ఉమేష్‌చంద్ర 6వ తరగతి చదివే విద్యార్థి రెండురోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మనోవేదన నుంచి కోలుకోకముందే వారి కుటుంబంలో కలహాలు చోటు చేసుకోవడంతో శ్రీనివాసులు, భార్య శిరీష, కుమార్తె కీర్తన ముగ్గురు గురువారం రాత్రి తమ ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకు మునుపు శ్రీనివాసులు కుటుంబసభ్యులను ఆత్మహత్య చేసుకున్నట్లు వాట్సప్‌లో ఐకెపి సభ్యులకు మెసేజ్ చేశాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారందరినీ బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో శిరీష పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. బత్తలపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రంలో నాసిరకం పౌష్టికాహారం

* నలుగురు చిన్నారులకు తీవ్ర అస్వస్థత
హిందూపురం, నవంబర్ 16 : పట్టణంలోని ఆబాద్‌పేట ఆంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం నాసిరకం ఆహార పదార్థాలను చిన్నారులకు ఇవ్వడంతో నలుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పౌష్టికాహారం అందివ్వడంలో భాగంగా పప్పుశెనగలను ఉడకబెట్టి చిన్నారులకు ఇచ్చారు. అయితే ఆ శెనగలు పురుగులు పట్టి కుళ్ళిపోవడంతో అవి సక్రమంగా ఉడకలేదు. వాటిని తిన్న కొద్ది సేపటికే సాధియా (3), అర్షద్ (3), రూహిత (4), ఫైజల్ (3)లు వాంతులు, విరేచనాలకు గురయ్యారు. ఒక్కసారిగా ఒకే వీధికి చెందిన చిన్నారులు ఎందుకు అస్వస్థతకు గురయ్యారో అర్థం కాక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా అప్పటికే ఆ చిన్నారుల చేతుల్లో అంగన్‌వాడీ కేంద్రంలో అందచేసిన పప్పుశెనగ ధాన్యం ఉండటం, అవి నాసిరకంగా ఉండటంతో పాటు పురుగులు పట్టిన ఆనవాళ్ళు అగుపించడంతో ఆయా కుటుంబ సభ్యులు విస్మయానికి లోనయ్యారు. బాధిత చిన్నారులను వెంట బెట్టుకొని అంగన్‌వాడీ కేంద్రం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అదే విధంగా అంగన్‌వాడీ కేంద్రంలో నిలువ ఉన్న పప్పుశెనగలను చూసి అవాక్కయ్యారు. పురుగులు పట్టి ఉండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం స్థానిక సీడీపీఓ దృష్టికి తీసుకెళ్ళగా ప్రభుత్వం అందచేసిన పప్పుశెనగలను అందిస్తామని, ఇకపై ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకొంటామన్నారు. బాధిత చిన్నారులను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు.

కేవశరెడ్డి స్కూల్‌లో టీచర్ దాష్టీకం

* చిన్నారి అరచేతికి పెన్సిల్‌తో గుచ్చిన టీచర్
అనంతపురం సిటీ, నవంబర్ 16 : నగరంలోని సాయినగర్ కేశవరెడ్డి స్కూల్‌లోని ఓ టీచర్ దాష్టీకాన్ని ప్రదర్శించింది. అసైన్‌మెంట్ రాయలేదని 4వ తరగతి చదువుతున్న హరిచరణ్ అరచేతికి టీచర్ జిగిని పెన్సిల్‌తో గుచ్చింది. దీంతో పెన్సిల్ ముక్క అరచేతిలో చొచ్చుకుపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విద్యార్థిని ఆసుపత్రి తరలించి చికిత్స చేయించారు. వైద్యులు సర్జరీ చేయాలని వైద్యులు సూచించడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకూ వైద్యులు సర్జరీ చేసి చేతిలోని పెన్సిల్ బయటకు తీయడంతో అందరూ ఊపిరీపీల్చుకున్నారు. స్కూలు, టీచర్‌పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు పోలీస్టేషన్‌లో ఫిర్వాదు చేయడంతో పోలీసులు స్కూల్‌కు చేరుకుని విచారించారు. తల్లిందడ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్వాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.