క్రైమ్/లీగల్

వానపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట, నవంబర్ 16: కొత్తపేట మండలం వానపల్లిలో శుక్రవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 12 తాటాకిళ్లు దగ్ధమై 19 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వానపల్లి కొత్తరోడ్డులో గల ఒక ఇంట్లో మహిళ వంట చేస్తుండగా పొయ్యి నుండి మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న కొత్తపేట అగ్నిమాపక దళం అధికారులు హుటాహుటీన వచ్చి మంటలను అదుపు చేశారు. ఇళ్లు రోడ్డుకు ఇరువైపులా ఉండడంతో అప్పటికే 12 ఇళ్ళు బూడిదయ్యాయయని, కనీసం ఇంటిలో గల ఏ వస్తువును తీసుకోలేకపోయారని స్థానికులు తెలిపారు. కూలీ పనిచేసుకునే వీరు కట్టుబట్టలతో మిగిలారని వారు తెలిపారు. విషయం తెలుసుకున్న కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని రూ.40వేలు ఆర్ధిక సహాయంతో పాటు ఒక్కొక్క కుటుంబానికి 20కిలోల బియ్యం, దుస్తులు పంపిణీ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఒక్కొక్క కుటుంబానికి రెండు వేల నగదు 20కిలోల బియ్యం, వంట పాత్రలు, దుస్తులు పంపిణీ చేశారు. ప్రభుత్వ తక్షణ సాయంగా రూ. 5వేల రూపాయలను అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ధరణాల రామకృష్ణ, పల్లి భీమారావు, కంఠంశెట్టి ప్రభాకర్, మద్దింశెట్టి శ్రీను, బొంతు గౌరీశంకర్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, మార్గాన గంగాధర్, బండారు సత్తిరాజు, ముత్యాల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.