క్రైమ్/లీగల్

ట్రావెల్స్ బస్సులో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, నవంబర్ 16 : హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శుక్రవారం సూళ్లూరుపేటలో భారీ చోరీ జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన జి మధుకర్ గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లే బస్సులో ఒకటిన్నర కిలో బంగారు, రూ.2 లక్షలు నగదు బ్యాగ్‌లో తీసుకొని బయలుదేరారు. ఉదయం సూళ్లూరుపేటకు బస్సు చేరుకొంది. జాతీయ రహదారిపై స్థానిక హోలీక్రాస్ సమీపంలో ఉన్న ఆంధ్ర స్సైసీల్ హోటల్ వద్ద టిఫిన్ చేసేందుకు నిలిపారు. బస్సులో ఉన్న వారు హోటల్‌లో టిఫిన్ చేసేందుకు దిగారు. బాధితుడు మధుకర్ కూడా బస్సులో నుంచి దిగి హోటల్‌లో టిఫిన్ చేసి బస్సులోకి వెళ్లాడు. తన కూర్చొన్న సీటులో పెట్టిన బ్యాగ్ లేకపోవడంతో పక్క సీటులో ఉన్న వారిని అడిగారు. వెంటనే బాధితుడు సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని తన వద్దనున్న బ్యాగ్ చోరీకి గురైందని, అందులో రూ.2 లక్షలు ఉందని ఎస్సై ఇంద్రసేనారెడ్డికి మొరపెట్టుకున్నాడు. ఎస్సై బాధితుని ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వెళ్లి బస్సులో ఉన్న వారందరిని విచారించారు. హోటల్ వారిని కూడా విచారించి బాధితుడి బ్యాగ్‌కు సంబంధించిన వివరాలు అడిగారు. గూడూరు డివిజన్, జిల్లా అధికారులకు సమాచారం అందించారు. కొంతసేపటి తరువాత బాధితుడు ఆ బ్యాగులో 1470 గ్రాముల బంగారు బిస్కెట్ కడ్డీలు కూడా ఉన్నాయని పోలీసులకు తెలిపారు. బాధితుడు ఆందోళనకు గురై ఒక్కోసారి ఒక్కోవిధంగా చెప్తుండటంతో పోలీసులు అనుమానంతో మధుకర్ పనిచేసే బంగారు నగల వ్యాపారికి ఫోన్ చేసి సమాచారం తెలిపారు. చెన్నైలో బంగారు నగల వ్యాపారం చేసుకునే మాన్ శుక్లాల్ అనే వ్యాపారి వద్ద మధుకర్ సీజన్ గుమస్తాగా పనిచేస్తున్నాడు. బంగారు వ్యాపారి హైదరాబాద్‌లో ఉండే చందన బ్రదర్స్ వారితో నగల వ్యాపారంతో సంబంధాలు పెట్టుకొని వారు ఇచ్చిన ఆడర్ ప్రకారం బంగారు నగలు చేసి సరఫరా చేసేవారు. ఈ క్రమంలోనే చందన బ్రదర్స్ వారు మధుకర్ వద్ద 1470 గ్రాముల బంగారు బిస్కెట్ కడ్డీలు ఇచ్చి పంపారు. చందన్ బ్రదర్స్ వద్ద 14వ తేదీన ఈ బంగారం తీసుకున్నట్లు వారు చెప్తున్నారు. ఈ చోరీ సంఘటనపై పోలీసులకు పలు అనుమానాలు తలెత్తడంతో వెంటనే క్రైంపార్టీని రంగంలోకి దింపారు. క్రైం ఎఏస్పీ జి ఆంజనేయులు, గూడూరు డీఎస్పీ విఎస్ రాంబాబు సూళ్లూరుపేటకు చేరుకొని బాధితుడిని విచారించారు. చోరీ జరిగిన సంఘటన వద్ద సీసీ కెమెరాలు ఉండటంతో పోలీసులు ఆ పుటేజిలను పరిశీలిస్తున్నారు. ఆ పుటేజిల్లో ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. బ్యాగ్‌లో అంత నగదు, బంగారు కడ్డీలు ఉంటే బాధితుడు బస్సులోనే పెట్టి ఎలా దిగుతాడు. జాగ్రత్తలు పాటించాలి కదా. ఆ సమయంలో బస్సులోకి ఎవరు కొత్త వ్యక్తులు కూడా ఎక్కనట్లు తెలుస్తోంది. బస్సులో ఉండే వారు చోరీకి పాల్పడితే వెంటనే వారి అక్కడ నుంచి వెళ్లిపోతారు కదా. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ బస్సులోనే ఉన్నారు. ఇలా పోలీసులకు ఈ చోరీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండటంతో బంగారు వ్యాపారిని చెన్నై నుంచి రప్పించారు. ఆ వ్యాపారిని క్రైం ఏఎస్పీ, డీఎస్పీ ప్రత్యేకంగా విచారించి పలు విషయాలు రాబట్టారు. వ్యాపారి ఒకటిన్నర కిలో బంగారు బిస్కెట్లు, రూ.2 లక్షలు నగదు తీసుకొని వస్తున్న విషయం మాత్రం వాస్తమన్నారు. దాదాపు ఎనిమిదేళ్లుగా వ్యాపారి వద్ద మధుకర్ పనిచేస్తున్నట్లు తెలిసింది. అసలు చోరీ జరిగిందా లేదా. బాధితుడే బంగారును పక్కదారి పట్టించి చోరీకి గురైనట్లు సృష్టించాడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు వర్గాల నుంచి రాబట్టిన సమాచారం మేరకు పోలీసులు ఈ చోరీ కేసులో దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడ్ని అదుపులోకి తీసుకొని పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి వివరాలు తెలియజేస్తామని డీఎస్పీ తెలిపారు.