క్రైమ్/లీగల్

ఉల్లిపాలెంలో విద్యుద్ఘాతానికి యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు, నవంబర్ 19: మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామంలో ఇంటింటికి ఫైబర్ నెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో సోమవారం ఉదయానే్న విద్యుత్ స్థంభం ఎక్కి కేబుల్ లైన్‌కు సంబంధించిన ఫిట్టింగ్‌లు చేస్తుండగా పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి కోడూరుకు చెందిన పెద్ది ఏడుకొండలు (29) దుర్మరణం చెందాడు. అతనికి సహాయకునిగా వెళ్లిన కేబుల్ యజమాని కళ్ల ముందే కార్మికుడు చనిపోవటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతనికి మెరుగైన వైద్యం కోసం వైద్యశాలకు తరలించగా చనిపోయిన ఏడుకొండలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ నెల 21వతేదీన ఉల్లిపాలెంలో సీఎం పర్యటించనున్న దృష్ట్యా ఆ గ్రామంలో ప్రతి ఇంట్లోనూ ఫైబర్ నెట్ ద్వారా ప్రసారం అందించాలని, త్వరగా పనులు ముగించాలనే ఉద్దేశంతో ఈ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఏడుకొండలకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి కూడా మృతి చెందటంతో కుటుంబానికి అతనే ఆధారం కాగా మా పరిస్థితి ఏమిటని భార్య, తల్లి విలపిస్తున్న తీరు చూపరులను కలిసివేస్తోంది. స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి మృతుడి వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.