క్రైమ్/లీగల్

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు : నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. దస్తావేజు లేఖర్లు, కార్యాలయం సిబ్బంది వద్ద ఉన్న 47,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. ఏసీబీ డీఎస్‌పీ ఎస్‌వివి ప్రసాద్ ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో ప్రతి పనికి రేటు నిర్ణయించినట్లుగా ఆరోపణలు రావటంతో డిఐజీ ఆర్‌పి ఠాకూర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించామని చెప్పారు. సోమవారం 20 రిజిస్ట్రేషన్లు జరిగాయని, వీటికి సంబంధించిన రికార్డులు కూడా తనిఖీ చేస్తున్నామని అన్నారు. నూజివీడు సబ్ రిజిస్ట్రార్ మెడికల్ లీవ్‌లో ఉన్నందున సహాయ సబ్ రిజిస్ట్రార్ సహాయంతో తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. కార్యాలయం తనిఖీ చేస్తున్న సమయంలో తొమ్మిది మంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారని, వీరిని కూడా విచారిస్తున్నట్లు ఆయన వివరించారు. డాక్యుమెంట్ రైటర్లకు కార్యాలయంలోనికి రాకూడదని అన్నారు. ఈ దాడుల్లో డిఎస్‌పి ప్రసాద్ తో పాటు సిఐ లు ఎస్ వెంకటేశ్వరరావు, కే వెంకటేశ్వర్లు, రమేష్‌బాబు, కెనడీ తదితరులు పాల్గొన్నారు.