క్రైమ్/లీగల్

ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, నవంబర్ 29: విధుల్లో ఉన్న తోటి మహిళా కానిస్టేబుల్‌పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్‌కు రెండు సంవత్సరాలు జైలు శిక్ష, రూ 5వేలు జరిమానా విధిస్తూ గురువారం జిల్లా ఆరవ అదనపు న్యాయమూర్తి ప్రసాద్ తీర్పునిచ్చారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి అర్చన్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌లో రామన్ హెడ్ కానిస్టేబుల్‌గాను విధులు నిర్వహించే వాడు, ఇదే స్టేషన్‌లో జయభాను కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా 2016 మేనెల 27వ తేది రాత్రి హెడ్ కానిస్టేబుల్ రామన్ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ అయిన జయభాను పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో అప్పట్లో ఆమె తిరుపతి ఎంఆర్ పల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో కేసు విచారణలో భాగంగా హెడ్ కానిస్టేబుల్ రామన్ విధుల్లో ఉన్న తోటి మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ మేరకు తీర్పునిచ్చారు.