క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వర్స్ ఇన్స్‌పెక్టర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, డిసెంబర్ 1: వీరవాసరం మండలంలో పంచాయతీరాజ్ శాఖలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ (40) శనివారం రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. మండలంలోని మత్స్యపురి గ్రామంలో భవన నిర్మాణ పనులు చూడటానికి భీమవరం నుంచి మత్స్యపురి వస్తుండగా భీమవరం రూరల్ మండలం తుందుర్రు గ్రామ పరిధిలో ఒక ప్రైవేటు స్కూలుకు చెందిన బస్సు ఢీకొట్టడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎంతో మంచి వ్యక్తిగా పేరుపొందిన శ్రీనివాస్ మృతి వార్త తెలిసిన వెంటనే మండలంలోని అధికారులు హుటాహుటిన సంఘటనాస్థలానికి వెళ్లారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన మృతిపట్ల ఎమ్మెల్యే రామాంజనేయులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.