క్రైమ్/లీగల్

అగ్నిప్రమాదంలో వృద్ధురాలు సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరివిడి, డిసెంబర్ 2: ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో వట్టికాన చింతమ్మ(65) అనే వృద్ధురాలు సజీవదహనమైన సంఘటన మండలంలోని కోనూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు, కుటుంబీకులు అందించిన సమాచారం ప్రచారం కోనూరు గ్రామ శివారులో మామిడితోటకు చెందిన పూరిపాక అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో పూరిపాక ఆదివారం మధ్యాహ్నం 3.30గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈసమయంలో పాకలో ఉన్న వృద్దురాలు చింతమ్మ పూర్తిగా శరీరం గుర్తించలేనంతగా అక్కడికక్కడే మృతిచెందింది. వృద్దురాలు కుమారుడు తవుడు, కోడలు సునీత గ్రామంలో నివాసం ఉంటున్నారని గత ఆరేళ్ళుగా పక్షవాతంతో బాధపడుతున్న వృద్దురాలు చింతమ్మ పాకలోనే ఉంటుందని తెలిపారు. ఈప్రమాదంలో మృతిచెందిన వృద్దురాలిని చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కిరణ్‌కుమార్ నాయుడు తెలిపారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నామని అన్నారు.