క్రైమ్/లీగల్

కాజీపేటలో రూ.3కోట్లకు పైగా స్వాధీనం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 5: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట సిద్ధార్ధనగర్‌లో బుధవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు భారీగా నోట్లకట్టలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జీవద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అందులో రెండున్నర లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో దాదాపు మూడు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రాత్రి 11గంటలు అయినా లెక్కకొనసాగుతుంది. స్వాధీనం చేసుకున్న డబ్బు వర్ధన్నపేట నియోజకవర్గం నుండి మహాకూటమి అభ్యర్ధిగా పోటీచేస్తున్న దేవయ్యకు సంబందించినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈకార్యక్రమంలో వరంగల్ డీసీపీ వెంకట్‌రెడ్డి, టాస్క్ఫోర్స్ పోలసులు, సివిల్ పోలీసులు ఉన్నారు. సిద్దార్ధనగర్ నుండి ఓటర్లకు పంపకాలు చేసే క్రమంలోనే పెద్దమొత్తంలో 2000, 500నోట్లు పట్టుబడ్డాయి.