క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యర్రగొండపాలెం, డిసెంబర్ 6: పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం మండలంలోని గుర్రపుసాల గ్రామంలో జరిగింది. వివరాల మేరకు గ్రామానికి చెందిన గాగర్లమూడి యోగేశ్వరరావు (32) తనకు ఉన్న ఐదు ఎకరాల భూమిలో రెండు ఎకరాలు బత్తాయి, రెండు ఎకరాలు మిరప, ఒక ఎకరాలో బొప్పాయి సాగు చేశాడు. నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోయి అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య రమాదేవి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కూలిపనికి వెళ్లి యువకుడు మృతి
కంభం, డిసెంబర్ 6: కూలి పనికి వెళ్ళి యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలోని ఎర్రబాలెంలో గురువారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మిస్తుండగా కంకరమిల్లు దగ్గర పనిచేస్తున్న నల్లబోతుల వెంకటేశ్వర్లు (20)కు ప్రమాదవశాత్తు మిషన్ తగిలింది. దీంతో అతను అపస్మారకస్థితిలోకి వెళ్ళాడు. అతనిని కంభం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సంఘటనపై ఎస్సై శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.