క్రైమ్/లీగల్

విద్యుత్ టవర్ కూలి ముగ్గురు కార్మికులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందర్లపాడు, డిసెంబర్ 6: కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం పొక్కునూరు గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న పవర్ గ్రిడ్ విద్యుత్ టవర్ కుప్పకూలిపోవడంతో పనులు నిర్వహిస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు కార్మికులు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన కేటీపీఎల్ (కల్పతరు ప్రెవేటు లిమిటెడ్ కంపెనీ) ఆధ్వర్యంలో పవర్ గ్రిడ్ విద్యుత్ టవర్‌ల నిర్మాణం జరుగుతోంది. దీనికి సంబంధించి పిల్లర్‌ల నిర్మాణం నవయుగ కంపెనీ నిర్వహిస్తోంది. కాగా గురువారం మధ్యాహ్నం నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో టవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. కింద ఉన్న కార్మికులు భయంతో అక్కడ నుండి కొద్ది దూరం పరుగులు తీయగా టవర్ పైన సెఫ్టీ బెల్టులు కట్టుకొని పనులు చేస్తున్న కార్మికులు పవన్ బిస్వాఖర్మ (26), తులసిమత్ (28) తిరోమత్ (40), ఆకాష్, కార్తీక్ కూడో, ప్రదీప్‌లు ఇనుప స్తంభాల మధ్య చిక్కుకొని పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, సహచర కార్మికులు వెంటనే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పవన్, తులసీమత్‌లు మృతి చెందారు. మిగిలిన క్షతగాత్రులకు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం విజయవాడ తరలిస్తుండగా మరో కార్మికుడు తిరోమత్ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ సుబ్రమణ్యం, ట్రైనీ ఎస్‌ఐ రాంగోపాల్‌లు సందర్శించి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్మికుల మృతదేహాలకు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహింపజేసి మృతుల బంధువులకు సమాచారం అందించారు. నందిగామ డీఎస్‌పీ హరిరాజేంద్ర బాబు, రూరల్ సీఐ సతీష్‌లు సాయంత్రం ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

చిత్రం..వివరాలు సేకరిస్తున్న పోలీసులు