క్రైమ్/లీగల్

కోటాపై చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 61 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుడదని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపు గరిష్ఠంగా 50 శాతం మించి పెంచేందకు వీలులేదని ఉమ్మడి హైకోర్టు ఇంతకు ముందే మధ్యంతర ఉత్తర్వులు జారి చేసింది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. శుక్రవారం పిటిషన్‌ను జస్టిస్ రోహింగ్టన్ నారీమన్, జస్టిస్ కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా 50 శాతం కన్నా ఎక్కువ పెంచుకొనే అవకాశం కల్పించాలని కోర్టును అభ్యర్థించారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో బీసీల జనాభా పెరిగిందని ధర్మాసనానికి వివరించారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఇందిరా సాహ్ని కేసులో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో 50 శాతం మించి రిజర్వేషన్లు కొనసాగుతున్న విషయాన్ని గుర్తుచేసింది. ఆ తీర్పు ప్రకారమే 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లు విషయంలో హైకోర్టు మధ్యంతరం ఉత్తర్వులే ఇచ్చినందున అక్కడికే వెళ్లి పిటిషన్ ఉపసంహరించుకుంటామని తెలంగాణ తరపున్యాయవాది ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. తెలంగాణ తరపున న్యాయవాదులు సంజీవ్ కుమర్, రామచంద్రరావు, ఉదయ్‌కుమార్ సాగర్ హాజరయ్యారు.