క్రైమ్/లీగల్

కోడి కత్తి శీనుకు రిమాండ్ పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో వైసీపీ నేత జగన్‌పై గత అక్టోబర్ 25న హత్యాయత్నానికి పాల్పడిన జే శ్రీనివాస్‌కు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. వచ్చే నెల 21 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే మూడు సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం తిరస్కరించింది. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన కేసుకు సంబంధించి, ఇప్పటికే హైకోర్టులో వాజ్యం నడుస్తోంది. హత్యాయత్నం జరిగిన రోజున జగన్ ధరించిన చొక్కా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగించాలని జారీచేసిన నోటీసుకు వైసీపీ నేతలు సీల్డ్ కవర్‌లో చొక్కాను న్యాయస్థానంలో అప్పగించారు. ఈ కేసు విచారణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున అప్పటివరకూ తాము వాంగ్మూలం ఇ వ్వలేమంటూ న్యాయస్థానం ముందు వివరణ ఇచ్చుకున్న సంగతి విధితమే. తాజాగా నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ నిరాకరించి రిమాండ్ విధించారు.