క్రైమ్/లీగల్

న్యాయవాదికి రూ.50వేలు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: రిజర్వు బ్యాంకు అదనపుమూలధన నిల్వల విషయంలో జోక్యంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఇందుకు సంబంధించి ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన న్యాయవాది ఎంఎల్ శర్మ 50వేల రూపాయలు వ్యాజ్యం విలువగా న్యాయస్థానానికి చెల్లించాలని తీర్పునిచ్చింది. ‘ఈ వ్యాజ్యాన్ని కొనసాగించేందుకు గల కారణాలేవీ మాకు కనిపించడం లేద’ని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘కేంద్ర ఆర్థిక మంత్రి రిజర్వు మూలధనాన్ని దోచుకుంటున్నార’ని న్యాయవాది శర్మ తన వ్యాజ్యంలో ఆరోపించడం జరిగింది. ఆయన వాదనతో ఏకీభవించని ధర్మాసనం ’50వేల రూపాయలు డిపాజిట్ చేసే వరకు ఈ న్యాయవాది నుంచి తదుపరి వ్యాజ్యాలను స్వీకరించవద్ద’ని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. అంటే ఈ వ్యాజ్యాన్ని కొనసాగించదలుచుకుంటే న్యాయవాది యాభై వేల రూపాయలు న్యాయస్థానానికి చెల్లించాల్సివుంటుంది. ‘ఇలాంటి దాఖలుతో వ్యాజ్యాన్ని కొనసాగించవద్దు, న్యాయస్థానం సంతృప్తిచెందకపోతే మళ్లీ వ్యాజ్యం విలువను చెల్లించేలా ఆదేశించాల్సి వుంటుందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ న్యాయవాది శర్మకు సూచించారు. కాగా పీఎస్‌యూ బ్యాంకు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన 55వేల కోట్ల రూపాయల రుణాన్ని ఆర్థిక మంత్రి జైట్లీ మాఫీ చేశారని విరాళాల రూపంలో లబ్ధిపొందారని ఆ న్యాయవాది వ్యాజ్యంలో చేసిన మరో ఆరోపణలో పసలేదని ధర్మాసనం పేర్కొంది.