క్రైమ్/లీగల్

ఇసుకమేట పడి ఒకని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, మార్చి 9: ఇష్టారాజ్యంగా తవ్వేసిన ఇసుక దిబ్బల్లో ఇసుకను తోడుతూ ఓ వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన హిందూపురం రూరల్ మండల పరిధిలోని బేవినహళ్ళి సమీపంలోని పెన్నానదిలో చోటు చేసుకుంది. హిందూపురం రూరల్ మండల పరిధిలోని పూలకుంటకు చెందిన బయపురెడ్డి (40) శుక్రవారం తోటి కూలీతో ట్రాక్టర్ తీసుకుని బేవినహళ్ళి సమీపంలోని పెన్నానది ప్రాంతంలోని ఇసుక పాయింట్ వద్దకు వెళ్లాడు. బయపురెడ్డి ఇసుక పారతో తోడుతుండగా ఎనిమిది అడుగుల పైభాగంలో ఉన్న ఇసుక మేట ఒక్కసారిగా ఆయనపై పడింది. దీంతో రక్షించండి అంటూ కేకలు వేయగా అక్కడ ఉన్న కూలీ ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఇసుక మేట కింద భాగంలో ఉన్న బయపురెడ్డిని పైకి లాగలేకపోయాడు. వెంటనే ఆయన పరుగులు తీసి సమీపంలోని మరో ఇసుక పాయింట్ వద్ద ఉన్న కొందరిని అక్కడికి తీసుకువచ్చి పారలు, గునపాలతో ఇసుక మేటను పగులగొట్టి బయటకు తీయగా అప్పటికే బయపురెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. కాగా గత కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణాదారులు ఇష్టారాజ్యంగా పెన్నానదిలో ఇసుకను తరలిస్తుండటం, పెద్దపాటి గుంతలు ఏర్పడటం, గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా అధికార యంత్రాంగం దృష్టి పెట్టకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఏడాది క్రితం పోచనపల్లి సమీపంలో ఇదే తరహాలో ఇసుకను తోడుతూ సడ్లపల్లికి చెందిన ఓ కూలీ మృతిచెందాడు. ఇసుక పాయింట్ల వద్ద సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవడం, కనీసం హెచ్చరికలు కూడా చేయకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బయపురెడ్డి మృతి చెందడం ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. బయపురెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు రూరల్ ఎస్సై శేఖర్ సంఘటనా స్థలాన్ని చేరుకుని కేస నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.