క్రైమ్/లీగల్

గోదావరిలో శవమై తేలిన బ్యాంకు ఉద్యోగి దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 8: రాజమహేంద్రవరంలోని గాదాలమ్మనగర్‌లో నివసించే బ్యాంకు ఉద్యోగి, ఆయన భార్య గోదావరిలో శవమై తేలారు. ఆయన కుమారుడి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అతని సెల్‌ఫోన్ కూడా దొరకలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కెనరా బ్యాంకు ఉద్యోగి కొల్లి ఆనందకుమార్(46), ఆయన భార్య అరుణ(42), కుమారుడు లక్ష్మీచంద్ సాయిచరణ్(20)లు గురువారం అదృశ్యమయ్యారు. అయితే ఆయన మోటార్‌సైకిల్, చెప్పులు, సెల్‌ఫోన్ కొవ్వూరు వైపు రోడ్డుకంరైలు వంతెనపై లభ్యం కావడంతో బొమ్మూరు సిఐ కెఎన్ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ ఎంవి శివనాగబాబు తమ సిబ్బందితో కలిసి గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. వంతెన 135వ స్తంభం వద్ద ఆనందకుమార్ మృతదేహం, వాడపల్లి ఇసుక ర్యాంపు సమీపంలో అరుణ మృతదేహం లభ్యమయ్యాయి. వారి కుమారుడి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఆనందకుమార్ కుమారుడు సాయిచరణ్ సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చదువులో చురుగ్గా ఉండే అతను తన స్నేహితులతో కలిసి సౌరశక్తితో నడిచే కారు ఇంజన్‌ను రూపొందించాడు. అమరావతిలో ఇంజన్ ప్రదర్శనకు ప్రశంసలు లభించడంతో తుని సమీపంలో తయారీ సంస్థను ఏర్పాటు చేసేందుకు తన స్నేహితులతో కలిసి ఇద్దరు దళారులను సంప్రదించారు. వారి సూచనల మేరకు ముందుగా ఒక స్థలాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించాడు. అయితే స్థలం కొనుగోలులో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు, దళారుల చేతిలో మోసపోవడం, స్థల యజమానుల వేధింపులకు తోడు అప్పులు ఇచ్చిన స్నేహితుల ఒత్తిళ్లతో తీవ్ర మనస్తాపానికి గురై, ఆత్మహత్య చేసుకుంటానని తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించాడు. దీంతో వారు కూడా మానసికంగా తల్లడిల్లిపోయారు. ఈనేపథ్యంలో కుటుంబమంతా కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గురువారం రాత్రి ఆనందకుమార్ తన భార్య, కుమారుడితో కలిసి కొవ్వూరులో సెకెండ్‌షో సినిమాకు వెళ్లారు. సినిమా విడుదలైన తరువాత ముగ్గురూ కలిసి రోడ్డుకంరైలు వంతెనపైకి చేరుకున్నారు. వంతెనపై భార్యభర్తల చెప్పులు, సెల్‌ఫోన్లు మాత్రమే లభ్యం కావడంతో సాయిచరణ్ ఆచూకీ మిస్టరీగా మారింది. ఆత్మహత్యకు ముందు ఆనందకుమార్ తమను మోసం చేసిన వారి వివరాలతో లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు వ్యక్తులు రూ. 23.75లక్షల మేరకు తమను మోసం చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వకపోవడం, స్థలాన్ని రిజిస్టర్ చేయకపోవడంతో విసిగి వేసారినట్లు తెలిపారు. బొమ్మూరు పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు. ఆనందకుమార్, ఆయన భార్య అరుణ మృతదేహాలను శనివారం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.

అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా
సామర్లకోట, డిసెంబర్ 8: సామర్లకోట-పిఠాపురం రోడ్డులో బ్రౌన్‌పేట సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అయ్యప్ప భక్తులతో వెడుతున్న ప్రయివేటు టూరిస్టు బస్సు ప్రమాదవశాత్తూ పంట కాల్వలోకి బోల్తాపడింది. అదృష్టవశాత్తూ బస్సులోవున్న అయ్యప్ప భక్తులు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. గొల్లప్రోలు మండలం బి ప్రత్తిపాడు గ్రామానికి చెందిన 20 మంది అయ్యప్పభక్తులు శబరిమల నుండి తిరిగి శనివారం ఉదయం వస్తుండగా పిఠాపురం రోడ్డులో రోడ్డుకు ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని డ్రైవర్ తప్పించబోగా బస్సు అదుపుతప్పి పెట్రోల్ బంకు వైపు బోల్తా పడింది. మరో 20 మంది భక్తులు వివిద ప్రాంతాల్లో దిగిపోగా, 20 మంది మాత్రమే బస్సులో ఉన్నట్లు సమాచారం. బస్సు విద్యుత్ స్థంభాలను ఢీకొట్టి పంట కాల్వలోకి పడింది. సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.