క్రైమ్/లీగల్

వాగులోపడి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలేరుపాడు, డిసెంబర్ 8: వేలేరుపాడుకు చెందిన వలపర్ల కౌశిక్ (13) అనే విద్యార్థి మండలంలోని గుళ్లవాయి సమీపంలోని పెద్దవాగులో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వేలేరుపాడు మండలం తాటికూరుగొమ్ము కాలనీకి చెందిన వలపర్ల కౌశిక్ స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. కాగా వేలేరుపాడులో ఎలిజబెత్ స్కూలు విద్యార్థులతో కలిసి పాఠశాల యాజమాన్యం పిక్‌నిక్ నిమిత్తం మండలంలోని గుళ్లవాయికి వెళుతున్నారు. అయితే గతంలో ఇదే పాఠశాలలో చదువుకున్న కౌశిక్ శనివారం సెలవు దినం కావటంతో ఎలిజబెత్ స్కూలు ఉపాధ్యాయులతో తానూ వస్తానని చెప్పి వారితో పిక్‌నిక్‌కు వెళ్లాడు. కార్యక్రమం అంతా సజావుగానే సాగింది. అయితే తిరిగి వచ్చే సమయంలో ఆఖరిగా ఒకసారి స్నానం చేసి వస్తానని చెప్పి పెద్దవాగులోకి దిగాడు. ప్రమాదవశాత్తు వాగులో ఒక చోట లోతుగా ఉన్నచోట పడి మృతిచెందాడు. అయితే మృతిచెందాడన్న విషయం తెలియని ఎలిజబెత్ పాఠశాల ఉపాధ్యాయులు హుటాహుటిన వేలేరుపాడు ప్రభుత్వాసుపత్రికి కౌశిక్‌ను తీసుకువచ్చారు. కౌశిక్‌ను పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్టు నిర్థారించారు. విషయం తెలుసుకున్న వేలేరుపాడు ఏఎస్సై గరాట రాజు సంఘటనా వివరాలు తెలుసుకుని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కౌశిక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నట్టు పోలీసులు తెలిపారు.