క్రైమ్/లీగల్

జాతీయ లోక్ అదాలత్‌లో 106కేసులు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, డిసెంబర్ 8: గజపతినగరం పస్ట్‌క్లాస్ మున్సిప్ కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 106 కేసులను న్యాయమూర్తి పల్లి నాగేశ్వరరావు పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎన్నుకోవడం ద్వారా కాలాన్ని డబ్బును ఆదా చేసుకోవచ్చని తెలిపారు. చిన్న చిన్న తగువులకు పోలీసుస్టేషన్లు, కోర్టులు చుట్టూ తిరిగి సమయన్ని డబ్బును వృధా చేసుకోకుండా గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు రెడ్ది శ్రీనివాసులనాయుడు, దేవర ఈశ్వరరావు, ఉప్పలపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

లోక్ అదాలత్‌లో 94కేసులు పరిష్కారం
సాలూరు, డిసెంబర్ 8: పట్టణంలోని ఎంఎం కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 94 కేసులు పరిష్కారమయ్యాయి. బ్యాంకు కేసు ఒకటి, క్రిమినల్ కేసులు 14, ఎక్సైజ్ కేసులు 76 పరిష్కారమయ్యాయి. ఎక్సైజ్ కాంపౌండ్ ఫీజులు 15,200 రూపాయలు వసూళ్లు చేశారు. బొబ్బిలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ పిఎస్‌విబి కృష్ణసాయితేజ అధ్యక్షతన జరిగిన అదాలత్‌లో సీఐ ఇలియాజ్ మహ్మద్, పట్టణ ఎస్‌ఐ అశోక్‌కుమార్, లోక్ అదాలత్ సభ్యులు ఎస్ వేణుగోపాల్, సామాజిక కార్యకర్త ఏ నాగమణిలు పాల్గొన్నారు.