క్రైమ్/లీగల్

జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్‌లో 1330 కేసులు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), డిసెంబర్ 8: న్యాయ వ్యవస్థలో లోక్ అదాలత్ ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా లక్షలాది కేసులు త్వరితగతిన పరిష్కారమై కక్షిదారులకు ఊరట కలుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ హరిహరనాథ శర్మ పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా లోక్ అదాలత్ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సభకు అధ్యక్షత వహించిన శర్మ మాట్లాడుతూ రాజీమార్గమే కేసుల పరిష్కారానికి రాజమార్గమని వర్ణించారు. తద్వారా కక్షిదారుల విలువైన సమయంతో పాటు, వ్యయం కూడా తగ్గుతుందన్నారు. అనంతరం వివిధ బెంచ్‌ల ద్వారా జరిగిన పరిష్కార కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా 86 సివిల్ కేసులు, 913 క్రిమినల్ కేసులు 31 చెక్‌బౌన్స్ కేసులు, మోటరు వాహన ప్రమాద బీమా కేసులు 132, కార్మిక వివాదాల కేసులు 12, వివాహ సంబంధ కేసులు 43, వివిధ బ్యాంకులకు సంబంధించిన కేసులు 14, ముందస్తు వివాదాల కేసులు 99 పరిష్కారమయ్యాయి. ఆయా కేసుల్లో కక్షిదారులకు 5.28 కోట్ల రూపాయల మేర పరిహారం అందింది. ఈ కార్యక్రమంలో గుంటూరు బార్ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సోమసాని బ్రహ్మానందరెడ్డి, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, రూరల్ ఎస్‌పి ఎస్‌వి రాజశేఖరబాబు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎల్ తేజోవతి తదితరులు పాల్గొన్నారు.