క్రైమ్/లీగల్

అసెంబ్లీ చౌరస్తాలో కారు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగడంతో స్వల్పంగా దగ్ధమైన ఘటన శనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో సైఫాబాద్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మాసాబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షార్ఫుద్దీన్ ఏపీ 29 క్యూ 6441 నంబర్ గల శాంత్రో కారు మాసాబ్‌ట్యాంక్ నుండి నడుపుకుంటూ వచ్చి లక్డీకాపూల్ అశోక హోటల్ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించి యూటర్న్ చేస్తుండగా అకస్మాత్తుగా కారు నుంచి మంటలు వచ్చాయి. గమనించిన మరో కారు డ్రైవర్ అతడిని అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే కారు డ్రైవర్ షార్ఫుద్దీన్ కారు నుంచి దిగిపోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. భాదితుడి ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.