క్రైమ్/లీగల్

క్వారీ గుంతలో పడి వృద్ధుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమీన్‌పూర్, డిసెంబర్ 8: క్వారీ గుంతలో పడి ఒక వృద్ధుడు మృతిచెందిన సంఘటన అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి సీఐ ప్రభాకర్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అమీన్‌పూర్ మండల పరిధిలోని దాయర గ్రామానికి చెందిన రాములు (60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. కాగా శుక్రవారం ఇంటినుండి పొలానికి వెళ్తున్నానని తెలిపి బయటకు వెళ్లాడు. ఎంతకు తిరిగి రాకపోవడంతో అతని కుమారుడు లక్ష్మణ్ వారి బంధువులను, తెసిన వారిని తన తండ్రి గురించి విచారించాడు. అయినప్పటికీ ఆచూకి లభ్యం కాలేదు. శనివారం రాములును వెతికే నిమిత్తం సుల్తాన్‌పూర్ పరిధిలోని కంకర క్రషర్‌ల ప్రాంతానికి వెళ్లగా అక్కడ రాములు మృతి చెంది పడి ఉన్నాడు. ఈ మేరకు అమీన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ప్రభాకర్ తెలిపారు.