క్రైమ్/లీగల్

దుకాణంలోకి దూసుకెళ్లిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, డిసెంబర్ 9: గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఫ్రైడ్‌రైస్ దుకాణంలోకి ఆదివారం కారు అదుపుతప్పి దూసుకుపోయిన సంఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్రైడ్‌రైస్ షాపులో గ్యాస్ పొయ్యిమీద బాణిలిలో నూనె కాగుతున్న సమయంలో కారు దూసుకెళ్లడంతో వేడినూనె పడి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒక వ్యక్తికి కాలు విరిగింది. వాహన చోదకుడిని పట్టుకుని స్థానికులు దేహశుద్ది చేశారు. పోలీసులు కారును అదుపులోకి తీసుకుని చోదకుడిని స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనలో తిప్పవరప్పాడుకు చెందిన తల్లీకొడుకులు పరిమళ మణెమ్మ, యోగానంద్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. అమరావతి అనే మహిళకు కూడా తీవ్రగాయాలయ్యాయి. ఫ్రైడ్‌రైస్ షాపులో పనిచేస్తున్న విజయ్‌కు గాయాలు కాగా పూడి లక్ష్మీ నారాయణ అనే వ్యిక్తికి కాలు విరిగింది. వీరిలో మణెమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు గూడూరు 1వ పట్టణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.