క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో జలవనురల శాఖ సూపరింటెండెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, డిసెంబర్ 10: శ్రీశైలం ప్రాజెక్టు జలవనరుల శాఖలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న దాసరి మల్లికార్జునరావు సోమవారం మధ్యాహ్నం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. డ్యాం మెయింటెనెన్స్ డివిజన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వివి గిరి నుండి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ జయరామరాజు, ఇన్‌స్పెక్టర్లు నాగభూషణం, శ్రీ్ధర్‌తోపాటు సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. వివరాలు.. అదే శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వివి గిరి ఓ పోలీసు కేసులో సస్పెండ్ అయ్యారు. ఆ కేసును కోర్టులో కొట్టువేయడంతో తిరిగి అతనికి ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సస్పెన్షన్ సమయంలో రావాల్సిన బెనిఫిట్స్ కోసం కోర్టుకు వెళ్లడానికి సంబంధిత పత్రాలు కావాలని గిరి సూపరింటెండెంట్ మల్లికార్జునరావును అడుగగా రూ.10 వేలు లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు. చివరకు రూ.5 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపధ్యంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన సంభాషణను వీవీ గిరి తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ పథకం ప్రకారం అధికారులు సోమవారం మధ్యాహ్నం వలపన్ని రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండ్‌డెడ్‌గా మల్లికార్జునను పట్టుకున్నారు. పూర్తిస్థాయిలో విచారించి కేసు నమోదు చేసుకొని నిందితున్ని కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ జయరామ రాజు తెలిపారు. దాసరి మల్లికార్జునపై పలు అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ శాఖలో ఏసీబీ అధికారులు దాడి చేయడంతో మిగతా ఉద్యోగులకు ఒణుకు మొదలైంది.