క్రైమ్/లీగల్

నదిలో దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడికొండ, డిసెంబర్ 10: కుటుంబ కలహాల నేపథ్యంలో నదిలోదూకి కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా సంచలనం కలిగించిన ఈ సంఘటన వివరాలు ఇలావున్నాయి. తాడికొండ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న షేక్ మహ్మద్ అసాన్ షేర్లా (42) కొంత కాలంగా మానసిక వేదనతో ఉన్నారు. మాచర్లకు చెందిన హసన్ 1993లో ఉద్యోగంలో చేరారు. జిల్లాలోని దుర్గి, అమరా వతి, మంగళగిరి, గుంటూరులో పనిచేసి 2015లో తాడికొండకు బదిలీపై వచ్చిన షేర్లా కుటుంబ కలహాల నేపథ్యంలో గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నారు. ఈనెల 6వ తేది నుండి విధులకు హాజరు కావడం లేదు. తాడేపల్లిలో ఉంటున్న భార్య వద్దకు వెళ్ళిన అసాన్ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అందరితో కలివిడిగా ఉండే అసాన్ తమ మధ్య లేక పోవటాన్ని సాటి కానిస్టేబుళ్లు జీరించుకోలేక పోతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.