క్రైమ్/లీగల్

సీపీఎం నేత హత్యకేసులో భార్యే సూత్రధారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 9: గత నెల 27న హత్యకు గురైన సీపీఎం నేత కొంతలరావు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మృతుని భార్య తన ప్రియుడు, మరో ఇద్దరితో కలిసి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. సీఐ సత్యనారాయణరెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలం పట్టణానికి చెందిన ఐతంరాజు కొండలరావు- ముత్తేశ్వరి దంపతులు. కొండలరావు సీపీఎం పార్టీలో కొంతకాలంగా క్రియాశీలకంగా పని చేస్తున్నారు. భద్రాచలం పార్టీ కార్యాలయ సెక్రటరీగా కూడా ఉన్నాడు. అతని భార్య ముత్తేశ్వరికి ములకలపల్లి మండలం పూసూరుకు చెందిన నాగేశ్వరరావు అలియాస్ నానితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో కొండలరావును హతమారిస్తే తమ వివాహేతర సంబంధానికి అడ్డు ఉండదని భావించి గతనెల 27 అర్థరాత్రి వ్యూహం రచించారు. ఆరోజు పార్టీ కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత కొండలరావు భోజనం చేసి నిద్రించిన సమయంలో ప్రియుడికి సమాచారం ఇచ్చింది. అదే సమయంలో తనకు అనుకూలంగా ఉండే వరుసకు కొడుకైన మైనర్ బాలుడిని కూడా రమ్మని చెప్పింది. వ్యూహం ప్రకారం కొండలరావు నిద్రిస్తున్న సమయంలో ముత్తేశ్వరి, ఆమె ప్రియుడు నాగేశ్వరరావు, వీరిద్దరి స్నేహితుడైన పాల్వంచకు చెందిన సాంబశివరావు అలియాస్ శివ, మైనర్ బాలుడు కలిసి కొండలరావును గొంతు నులిమి హతమార్చారు. అనంతరం ఒక వాహనంలో మృతదేహాన్ని బూర్గంపహాడ్ మండలం గొమ్మూరు ఇసుక ర్యాంపు వద్దకు తీసుకెళ్లి ఇసుకలో పూడ్చిపెట్టారు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య ముత్తేశ్వరి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదు. అయితే హత్యలో వారికి సహకరించిన మైనర్ బాలుడు (కొండలరావు మరదలి కొడుకు) జరిగిన సంఘటనను రహస్యంగా ఉంచలేకపోయాడు. తన ఇంట్లో అన్నయ్యకు, తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. అయితే తనపై అనుమానం రాకుండా ఉండేందుకు కొండలరావును అతని భార్య చంపిందని, శవాన్ని పూడ్చి పెట్టేందుకు తనను కూడా తీసుకెళ్లారని చెప్పాడు. ఈ విషయం బంధువులకు, సీపీఎం నేతలకు తెలియడంతో కొండలరావు అక్క కొక్కిరేణి లక్ష్మి ఫిబ్రవరి 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు గురించి మైనర్ బాలుడి నుంచి సమాచారం సేకరించి గొమ్మూరు ఇసుక ర్యాంపు నుంచి మృతదేహాన్ని వెలికి తీయించి అనంతరం భార్యను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నామని, ఈ కేసులో మైనర్ బాలుడు ఉండటంతో అతన్ని బోస్టన్ స్కూల్‌కు తరలిస్తున్నామని సీఐ వివరించారు.