క్రైమ్/లీగల్

260 క్వింటాళ్లు రేషన్ బియ్యం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 11: స్థానిక చింతలచేను వద్ద ఉన్న ఓ గోడౌన్‌లో దాదాపు 260 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసి ఉండగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సఫ్ల్సై అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన సమాచారంతో జరిగిన ఈ దాడుల సమయంలోనే రెండు షేర్ ఆటోల్లో రేషన్ బియ్యం అక్కడకు తీసుకువచ్చారు. అదే సమయంలో అధికారుల దాడులు జరుగుతున్న విషయం గుర్తించి అక్కడ నుంచి పరారయ్యారు. గోడౌన్‌లోని రేషన్ బియ్యంతోపాటు ఇతర బ్రాండ్‌లకు చెందిన వివిధ రకాల బియ్యం బస్తాలు, గోధుమ పిండి ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. వీటిలో రేషన్ బియ్యంను మాత్రం స్వాధీనం చేసుకుని సివిల్ సప్ల్సై గోడౌన్‌కు తరలించారు. ఈ గోడౌన్ ఎవరిదన్నది ఇప్పటి వరకు తెలియలేదు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ డాక్టర్ సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం కేజీ బియ్యం రూ. 28కి కొని రూ. 1కే తెల్లరేషన్ కార్డుదారులకు అందిస్తోందన్నారు. ఈ బియ్యాన్ని సక్రమంగా పేదలకు అందించకుండా కొందరు డీలర్లు అక్రమంగా అమ్ముకుంటున్న కారణంగానే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌లోకి చేరుతోందన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అక్రమార్కుల గురించి సమాచారం తెలిసిన వెంటనే తమకు తెలియజేయాలని కోరారు. గోడౌన్ నిర్వాహకుని కోసం గాలిస్తున్నామని, ఎంతటి వారినైనా వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ మద్దయ్య ఆచారి, ఏఎస్‌ఓ శేషాచల రాజు, సీఎస్‌బీటీ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.