క్రైమ్/లీగల్

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదలకూరు, మార్చి 9 : పొదలకూరు మండలం బత్తులపల్లి దళితవాడకు చెందిన ఊచపల్లి వెంకటేశ్వర్లు (22) అనే యువకుడు శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పొలాల్లో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వ్యక్తిగత పనులపై బుచ్చిరెడ్డిపాళెంకు వెళ్లిన వెంకటేశ్వర్లు తిరిగి ముందురోజు రాత్రి పదిన్నర గంటలకు అక్కడ నుంచి బయలుదేరాడు. అయితే తెల్లారేసరికల్లా అతను విగతజీవిగా మారి కనిపించాడు. మృతదేహం పక్కనే సగం ఖాళీగా ఉన్న పురుగుల మందు డబ్బా కనిపిస్తోంది. అయితే పురుగుల మందు సేవించిన ఆనవాళ్లు ఏమీ లేవని పోలీసులు చెప్తున్నారు. మృతదేహంపై ఎక్కడా గాయాలు కూడా లేవని, మెడ కింద మాత్రం ఉబ్బినట్లుగా కనిపిస్తుందని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇతనికి ప్రేమ వ్యవహారంలో వివాదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు పథకం ప్రకారం హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.