క్రైమ్/లీగల్

కల్లు వివాథంలో గిరిజనుడు హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డుంబ్రిగుడ, డిసెంబర్ 13: జీలుగుకల్లు సేవించడంలో తలెత్తిన వివాదం గిరిజనుడి హత్యకు దారితీసింది. ఇందుకు సంబంధించిన స్థానిక ఎస్.ఐ.కథనం ప్రకారం మండలంలోని కొర్రా పంచాయతీ పెదపాడు గ్రామానికి చెందిన గెమ్మెలి గంగరాజు( 55) కించుమండ సంతబయలులో నివాసం ఉంటున్నాడు. అయితే బుధవారం సాయంత్రం జీలుగు కల్లు సేవించేందుకు పక్కనే ఉన్న ఒక దుకాణం వద్దకు వెళ్లగా అప్పటికే కల్లు సేవిస్తున్న అనంతగిరి మండలం కరకపాడు గ్రామానికి చెందిన భూర్జ రాజు డబ్బులు చెల్లించకుండా వెళ్లిపోతున్నాడు. దీంతో కల్లు విక్రయించే వ్యాపారి డబ్బులు కోసం అడుగగా, పక్కనే ఉన్న గంగరాజు డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నావేమని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహాం చెందిన రాజు మద్యం మత్తులో గంగరాజును కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. కత్తిపోట్లతో తీవ్ర రక్తస్రావమైన గంగరాజును స్థానికులు అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు. కింగ్‌జార్జి ఆసుపత్రికి తరలిస్తుండగా గంగరాజు బుధవారం రాత్రి మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ. హిమగిరి విలేఖరులకు తెలిపారు. నిందితుడు రాజును త్వరలో అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు.