క్రైమ్/లీగల్

వృద్ధురాలు సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చిరెడ్డిపాళెం, మార్చి 9 : ఒంటరిగా నిద్రించిన ఓ వృద్ధురాలు గురువారం రాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా పూరిల్లు దగ్ధమైన సంఘటనలో సజీవ దహనమైంది. ఆ వృద్ధురాలు ఇల్లు దగ్ధమవుతుంటే వృద్ధాప్యంతో పాటు అంధురాలు కావడంతో కదల్లేక అక్కడే కాలి బూడిదైందని పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సంఘటన బుచ్చిరెడ్డిపాళెం మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెనుబల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కోవూరు కాలువ గట్టుపై నిర్మించుకున్న పూరి గుడిసెలో తీరంశెట్టి సుబ్బయ్య, భార్య సుబ్బమ్మ, తల్లి చెంచమ్మలతో కలసి నివాసం ఉంటున్నారు. సుబ్బయ్య ఆయన భార్య సమీపంలోని పొలాలకు కాపలాదారులుగా పనిచేస్తున్నారు. తల్లి చెంచమ్మ అంధురాలు కావడంతో సమీపంలో విడిగా గుడిసె నిర్మించి ఆమెను కుమారుడు పోషించుకుంటున్నాడు. గురువారం రాత్రి తీరంశెట్టి చెంచమ్మ (79) గుడిసెలో ఒంటరిగా నిద్రించింది. శుక్రవారం ఉదయం సుబ్బయ్య నిద్రలేచి చూసేసరికి తల్లి ఉంటున్న గుడిసె పూర్తిగా దగ్ధమై కనిపించింది. దీంతో నిశే్చష్టుడైన కుమారుడు తల్లి కోసం వెతికాడు. ఈ క్రమంలో ఆ గుడిసెకు ఓ వైపు అతని తల్లి శరీరం పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించింది. వృద్ధాప్యంతోపాటు అంధత్వం కారణంగానే తప్పించుకోలేక సజీవంగా దహనమై ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మృతురాలు నివాసం ఉంటున్న గుడిసెకు ఒక వైపు ఏర్పాటు చేసి ఉన్న విద్యుత్ తీగ ద్వారా విద్యుత్ ఘాతం ఏర్పడి ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. సుబ్బయ్య పనిచేసే పొలం యజమాని పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇచ్చారు. అనంతరం స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.