క్రైమ్/లీగల్

సీనియర్ సిటిజన్లపై నిర్లక్ష్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: దేశంలోని ప్రతి జిల్లాలో ఉన్న వృద్ధాశ్రమాల వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశంలో ఉన్న పది కోట్ల మంది వృద్ధుల సంక్షేమాన్ని పట్టించుకోవాలని, వారి హక్కులను పరిరక్షించాలని కోర్టు పేర్కొంది. సీనియర్ సిటిజన్లకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని కూడా కోర్టు సూచ్చింది. ప్రతి వ్యక్తి హుందాగా జీవించేందుకు, వారికి వైద్య సదుపాయాలు, గృహ వసతి కల్పించాలని కోర్టు రాష్ట్రప్రభుత్వాలను కోరింది. జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు తమ పరిధిలో వృద్ధులకు కల్పిస్తున్న సదుపాయాలపై వివరాలతో కూడిన నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. తల్లితండ్రులు, వృద్ధుల సంక్షేమం, పర్యవేక్షణ కమిటీ 2007 చట్టం కింద రాజ్యాంగ పరమైన హక్కుల గురించి సీనియర్ సిటిజన్లకు వివరించాలని ధర్మాసనం పేర్కొంది. ఈ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని కేంద్రం రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టు కోరింది. రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రం వృద్ధుల సంక్షేమం కోసం చేస్తున్న పథకాల పనితీరును సమీక్షించాలని కోరారు. వృద్ధులకు పెన్షన్ ఇచ్చే అవకాశాలను పరిశీలించాలన్నారు. భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ సామాజిక న్యాయం అమలు చేయాలన్నారు. ఈ స్ఫూర్తితో సీనియర్ సిటిజన్లసంక్షేమానికి కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు ఉమ్మడిగా కదలాలన్నారు.