క్రైమ్/లీగల్

వృద్ధురాలి అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 14: వృద్ధురాలు అదృశ్యమైనట్టు కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు అందింది. స్థానిక జైభారత్‌నగర్‌లో నివాసముంటున్న కాప్పాడ రాజమ్మ(70) ఈనెల 13వ తేదీ సాయంత్రం నుండి కనిపించకపోవడంతో ఆమె కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్ళ వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో కుమార్తె కాంతం స్థానిక పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు. సిఐ సిహెచ్ తిరుపతిరావు నేతృత్వంలో కంచరపాలెం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
దౌర్జన్యం చేసి చోరీకి పాల్పడిన వారిపై కేసు నమోదు
విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 14: ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేయడమే కాకుండా బంగారం, నగదు కాజేసిన వారిపై ఎంవీపీ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎంవీపీకాలనీలోని సెక్టర్-1లో గల నేతాజీపార్కు సమీపంలో పోచర్ల హరినాధ్ కుటుంబ సభ్యులతో నివాసముంటున్నారు. హరినాధ్ ఇంట్లో లేని సమయంలో అతని భార్య లక్ష్మి ఇంట్లో ఉండగా, ఎం హనుమంతరావు, శ్రీనివాసరావు, మరి కొంతమంది కలిసి దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడడమే కాకుండా, ఇంటికి ఉన్న సీసీ కెమెరాలను పగలగొట్టి బీరువాలో గల 50తులాల బంగారు ఆభరణాలు, రూ.80వేలు నగదు, విలువైన స్థలం డాక్యుమెంట్లను తీసుకుని పోయినట్టు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐ కరణం ఈశ్వరరావు నేతృత్వంలో ఎంవీపీ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
51మంది హెచ్‌సీలకు అదనపు ఎస్సైలుగా పదోన్నతి?
విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 14: విశాఖ రేంజ్ పరిధిలోని మూడు జిల్లాల్లో పని చేస్తున్న హెచ్‌సీలకు అదనపు ఎస్సైలుగా పదోన్నతి లభించనుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో పలు పోలీసు స్టేషన్లల్లో హెచ్‌సీలుగా పని చేస్తున్న 51మంది ఇటీవల విజయనగరంలోని పోలీసు ట్రైనింగ్ కాలేజీలో శిక్షణను పూర్తి చేసుకున్నారు. వీరందరికీ అదనపు ఎస్సైలుగా పదోన్నతి ఇవ్వడానికి డీఐజీ సిహెచ్ శ్రీకాంత్ లిస్టును తయారు చేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. పైన పేర్కొన్న 51మందికి వారి వారి ఇష్టానుకూలంగా మూడు జిల్లాల్లో కోరుకున్న పోలీసు స్టేషన్‌లో పోస్టింగ్ ఇవ్వడానికి డీఐజీ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది.