క్రైమ్/లీగల్

పౌష్టికాహార బియ్యం రీసైక్లింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరవలి, డిసెంబర్ 14: నిరుపేద పిల్లల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండాప్రభుత్వం పంపిణీచేస్తున్న పౌష్టికాహార బియ్యం పశ్చిమ గోదావరి జిల్లాలో రీ సెక్లింగ్ అయ్యి ఎఫ్‌సీఐ గౌడౌనుకు మిల్లర్ల ద్వారా సరఫరా అవుతున్నాయి. దీనితో అప్రమత్తమైన అధికారులు రెండు రైస్ మిల్లులపై దాడులుచేసి, భారీగా నిల్వలను స్వాధీనం చెసుకొన్నారు. జిల్లాలోని పెరవలి మండలంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తణుకు అసిస్టెంట్ గ్రెయిన్ పర్చేజింగ్ ఆఫీసర్ (ఏజీపీవో) లక్ష్మణబాబు వివరాలను విలేఖర్లకు వెల్లడించారు. తణుకు ఎఫ్‌సీఐ గౌడౌనుకు పెరవలి హేమాద్రి రైస్‌మిల్లు నుండి 270 క్వింటాళ్లు, కాకరపర్రు గణపతి రైస్‌మిల్లు నుండి 270 క్వింటాళ్లు బియ్యం కస్టమ్ మిల్లింగ్ రైస్‌గా వచ్చాయి. అధికారుల పరీక్షలలో ఈ బియ్యం పసిపిల్లలకు పౌష్టికాహారంగా పంపిణీచేసినవని నిర్థారణ అయ్యింది. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లోని పసిపిల్లలకు, వివిధ హాస్టళ్లలోని విద్యార్థులకు రక్తహీనత రాకుండా పౌష్టికాహారం కలిసిన బియ్యాన్ని పంపిణీచేస్తోంది. వీటిని ఫోర్టిఫైడ్ రైస్ అని పిలుస్తారు. బియ్యంలో క్వింటాలుకు ఒక కిలో చొప్పన పౌష్టికాహారం కలుపుతారు. ఈ మిల్లుల నుండి ఎఫ్‌సీఐ గోదాములకు సరఫరా అయిన బియ్యం ఫోర్టిఫైడ్ రైస్‌గా నిర్ధారణ కావడంతో రెండు మిల్లులపై అధికారులు దాడులు చేశారు. దాడులలో ఎటువంటి ఫొర్టిఫైడ్ బియ్యం నిల్వలు మిల్లులలో లభ్యం కాలేదు. అయితే ఉన్నతాధికారుల అదేశాల మేరకు పెరవలిలో హేమాద్రి మిల్లులోని 4కోట్ల విలువైన ఇతర నిల్వలను, కాకరపర్రులోని గణపతి రైస్‌మిల్లులోని 64 లక్షల విలువైన నిల్వలను అధికారులు స్వాధీనం చెసుకొన్నారు. ఈ రెండు రైస్‌మిల్లులపై నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టం క్రింద 6 ఏ కేసులను నమోదు చేశారు.