క్రైమ్/లీగల్

కల్తీ టీ పొడి విక్రేతలు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్చూరు, మార్చి 9: టీ చిక్కదనం కోసం టీ పొడిలో రంగులు కలిపి కల్తీ టీపొడిన అమ్ముతున్న ముగ్గురిని పర్చూరు పోలీసులు అరెస్టు చేసినట్లు చీరాల డిఎస్పీ డాక్టర్ ప్రేమకాజల్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కల్తీ టీ పొడి అమ్ముతున్న ముగ్గురుని శుక్రవారం విలేఖర్ల ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పర్చూరుకు చెందిన షేక్ కరిముల్లా, పిడుగురాళ్లకు చెందిన కె శ్రీనును వై జంక్షన్ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. అంతకుముందు రాజమండ్రికి చెందిన రెడ్డి వెంకటప్రసాద్‌రావును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రంగులు కలిపిన కల్తీ టీ తాగడం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తింటాయన్నారు. జాగ్రత్తగా వ్వవహరించాలన్నారు. కల్తీ టీ పొడి అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్రాండ్ ఉన్న టీ పొడి ఖరీదు ఎక్కువ అని ఆ టీ పొడిలాగే రంగు, రుచి ఇవ్వడానికి టీ పొడుల్లో రంగులు కలిపి తక్కువ ధరలకే విక్రయిస్తున్నా రని అన్నారు. రాజమండ్రికి చెందిన ప్రసాద్‌రావు లైసెన్సు లేకుండా టీ పొడి ప్యాక్ చేసి అమ్ముతున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 435 కేజీల టీ పొడిని, పిడుగురాళ్లకు చెందిన కె శ్రీను వద్ద 175కేజీల టీ పొడిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మూడు రోజుల క్రితమే కరిముల్లా వద్ద ఉన్న 90కేజీల టీ పొడిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాజమండ్రికి చెందిన ప్రసాద్‌రావు ప్యాకెట్లలో టీ పొడిని ప్యాక్ చేసి విక్రయిస్తున్నారని తెలిపారు. బ్రాండెడ్ టీ పొడిని, కల్తీ టీ పొడులను నీరు ఉన్న గ్లాసులో పరిక్షించారు. కల్తీ టీ పొడి ఉన్న గ్లాసులో నీరు వెంటనే రంగు మారడాన్ని గమనించారు. టీ పొడుల శ్యాంపులను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతామని తెలిపారు. ఈ సమావేశంలో ఇంకొల్లు సీఐ ఎం శేషగిరిరావు, ఎస్సై కె రామకృష్ణ పోలీస్ సిబ్బంది ఉన్నారు.