క్రైమ్/లీగల్

చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, డిసెంబర్ 15: తాండూ రు పోలీస్ సబ్ డివిజన్‌తో పాటు జిల్లాలో సంచలనం రేకేత్తించిన తాండూరు పెన్నా సిమెంట్స్ అధికారులు ఉద్యోగుల నివాస సముదాయంలో ఈ సంవత్సరం జనవరి 28న జరిగిన భారీకి సంబంధించిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా చెడ్డి గ్యాంగ్‌ను దాదాపు11 నెలల అనంతరం సుదీర్ఘ దర్యాప్తు అనంతరం పోలీసులు పట్టుకుని శనివారం దొంగల ముఠాను అరెస్ట్ చేశారు.
చెడ్డీ గ్యాంగ్ ముఠాకు చెందిన ఆరుగురు సభ్యుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.8లక్షలు విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మిడియా సమావేశంలో డీఎస్పీ ఎం.రామచంద్రుడు, రూరల్ సర్కిల్ సీఐ ఉపేందర్ పెన్నా సిమెంట్స్ ఉద్యోగుల కార్వర్టర్స్‌లో భారీ చోరీ ఘటన వివరాలు వెల్లడించారు. 24 దొంగతనాలకు పాల్పడినట్లు ఈ అంతర్ రాష్ట్ర ముఠాపై కేసులు నమోదయి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో తాండూరు పోలీసులు వికారాబాద్, నల్గోండ, సూర్యాపేట్ జిల్లాల పోలీసు బృందాలను గుజరాత్ రాష్ట్రం దావోద్ జిల్లాలోని అత్యంత ప్రమాద కరమైన ఆదివాసీ అరణ్య ప్రాంతంలో ఉన్న గర్బాడా తాలుకా నిమాచి గ్రామానికి చెందిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులే పెన్నా సిమెంట్స్ ఉద్యోగుల క్వార్టర్స్‌లో చోరీకి పాల్పడినట్లు ఆ ప్రాంతంలో 15 రోజుల పాటు, శ్రమించి రిక్కి నిర్వహించిన పోలీస్ బృందాలు గుర్తించాయని డీఎస్పీ రామచంద్రుడు తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహాద్దుల్లో ఉన్న ఆదివాసీ ప్రాంతం నిమాచి గ్రామస్తుడయిన చెడ్డీ గ్యాంగ్ ముఠా నాయకుడు అమలియ రుణము వేస్త్భాయ్, ముఠా సభ్యులు అదే ప్రాంతంలోని దస్లా గ్రామానికి చెందిన పర్మర్ కమలేష్ బాయ్, మధ్య ప్రదేశ్‌లోని జా షువా జిల్లా రాణాపూర్ తాలుకా సోతి యా జాలమ్ గ్రామానికి చెందిన సంజూభాయ్, మోనాబాయ్ మోహన్యాలను ప్రత్యేక బృందాలు వలపన్ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సభ్యుల పేర్లు అమలియర్ సెతాన్ బాయ్,అమలియర్ ముఖేష్ దారుహు బాయ్, అమలియర్ తుఫాన్ బాయ్ పరారీలో ఉన్నట్లు తాండూరు పోలీస్ అధికారులు వెల్లడించారు. చెడ్డీ గ్యాంగ్ కరుడు గట్టిన నేరస్తుల ఆగడాలు దర్యాప్తులో వెలుగు చూస్తున్నట్లు డీఎస్పీ, రూరల్ సీఐలు వివరించారు.