క్రైమ్/లీగల్

అక్రమ నిర్మాణాల కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 15: బోడుప్పల్ పట్టణంలోని ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఎట్టకేలకు రెవెన్యూ అధికార యంత్రాంగం కదిలింది. విలువైన స్థలాలను కబ్జా చేసి యదేచ్ఛగా ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారని పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై అధికారులు స్పందించారు. పోలీసు బందోబస్తు మధ్య శనివారం అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు ఆర్‌ఐ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మొత్తం పది ఇళ్లలో కేవలం మూడు ఇళ్లను మాత్రమే కూలగొట్టి మమా అనిపించుకోవడం పై అధికారులపై కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ప్రతినిధులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కబ్జాదారులపై కేసు నమోదైనట్లు ఎస్‌ఐ రఘురామ్ తెలిపారు.