క్రైమ్/లీగల్

డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ 265 మందికి జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు నగర వ్యాప్తంగా చేపడుతున్న డ్రంకన్ డ్రైవ్ కార్యక్రమం సత్ఫాలితాలనిస్తోంది. ఇందులో భాగంగా నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాల్లో 1 నుంచి 15 వరకు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో మొత్తం 961 మంది పట్టుబడ్డారు. ఈ మేరకు నాంపల్లి 4, 5వ మెట్రోపాలిటన్ కోర్టు 265 మందికి రెండు రోజులు మొదలుకుని ఒకనెల జైలు శిక్ష విధించగా, 8 మంది డ్రైవర్ల లైసెన్స్‌ను పూర్తిగా రద్దు చేసింది. ఈ క్రమంలో 50 మంది లైసెన్స్‌లను ఆరు నెలలు మొదలుకుని 5 సంవత్సరాల వరకు రద్దు చేసినట్లు నగర ట్రాఫిక్ అధికారులు తెలిపారు. మరో 903 మంది డ్రైవర్లకు కోర్టు దాదాపు 20లక్షల 89వేల 400 రూపాయల జరిమానా విధించింది. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన నలుగురికి, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఇద్దరికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు నగర ట్రాఫిక్ అధికారులు తెలిపారు.